డాక్టర్. ఎం. రాధాకృష్ణ చౌహన్, తాను చదువుకున్న యూనివర్సిటీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కొరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యూనివర్సిటీ లైబ్రరీకి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, భారతదేశ చరిత్ర సంస్కృతి, అర్థమెటిక్, రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ లాంటి విలువైన పుస్తకాలను సోమవారం అందజేశారు. గతంలో డాక్టర్ రాధాకృష్ణ చౌహన్ తెలంగాణ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి కోర్టు సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ చౌహాన్ ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి అభినందించి దాతలుమరింతమంది ముందుకు వచ్చి లైబ్రరీకి మరిన్ని పుస్తకాలు అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో , లైబ్రేరియన్ సత్యనారాయణ తో పాటు కాంపిటీటివ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రమణాచారి పాల్గొన్నారు.