టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పష్టతివ్వండి

Clarify the problems of TSRTC workers– 26న మహాధర్నాకు కదలండి : టీఎస్‌ఆర్టీసీ జాక్‌ పిలుపు
– మహాధర్నా గోడపత్రిక ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్‌ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది.. చట్ట రూపం దాల్చి 40 రోజులు గడుస్తున్నప్పటికీ పరిష్క రించాల్సిన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వ డం లేదని టీఎస్‌ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. సత్వరమే ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15న డిమాండ్స్‌ డే నిర్వహించినా సర్కారు నుంచి స్పందన లేకపోవడం తో 26న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఉంటే డ్యూటీలో- లేకపోతే మహాధర్నాలో ఉండాలని కార్మికులకు టీఎస్‌ ఆర్టీసీ జాక్‌ పిలుపునిచ్చింది. గురు వారం వీఎస్టీ చౌరస్తాలోని ఎంప్లాయీస్‌ యూనియ న్‌ ఆఫీసులో జేఏసీ చైర్మెన్‌, ఈయూ ప్రధాన కార్య దర్శి కె. రాజిరెడ్డి, జేఏసీ కన్వీనర్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.రావు, జాక్‌ నాయకులు జక్రయ్య(ఈయూ), గంగాధర్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్‌) కిషన్‌ గౌడ్‌, యూసఫ్‌ రెడ్డి, మల్లేష్‌, జంగయ్యతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం కె.రాజి రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2017, 2021 పేస్కేల్స్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. 2017 నాటి డీఏ 31.1 శాతమని మెర్జ్‌ చేసి 30శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, 2021 పే స్కేలుపై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. రివైజ్డ్‌ పే స్కేలు 2013 అరియర్స్‌లో సగం డబ్బుల కోసం ఇచ్చిన బాండ్స్‌పై రావాల్సిన డబ్బులను నేటి వరకు 8.75శాతం వడ్డీతో లెక్కించి చెల్లించాలన్నారు. వీలినం చేస్తున్నామనే పేరుతో సమస్యలు పరిష్కరించకుంటే ప్రస్తుతం ఉన్న 43వేల మంది కుటుంబాలతో పాటు 2017 నుంచి రిటైరైన, చనిపోయిన కార్మిక కుటుంబాలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పారు. ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రిటైరైన వారికి బకాయిలు చెల్లించడం లేదని, ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అందుకు యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
వి.ఎస్‌.రావు మాట్లాడుతూ.. 2023 జులై డీఏను వెంటనే అమలు చేయాలని, మొత్తం తొమ్మిది డీఏల అరియర్స్‌ను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డీఏలు సకాలంలో అమలు చేయనందున 2021 నుంచి రిటైరైన వారు తీవ్రంగా నష్టపోతున్నా రన్నారు. తాజాగా సంబంధిత శాఖ మంత్రి.. ప్రభుత్వం నియమించిన కమిటీపై నోటిఫికేషన్‌ ఇస్తా మని, నెలలోపే మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తోంద న్నారు. విలీనం విధి విధానాలు నిర్ణయం ఆదరా బాదరగా చేసేది కాదని, కార్మికులకు సంబంధించి. 80అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, అందుకని రిజిస్ట్రర్డ్‌ కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకోవా లని అన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విలీనం కంటే ముందే పరిష్కరించాల్సిన సమస్యలపై స్పష్టతనివ్వా లని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ యూనియన్ల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అనంతరం కార్మికుల కు జరిగిన, జరుగుతున్న నష్టం ఇక్కడ జరగకుండా చూడాలని కోరారు.