నవతెలంగాణ – హన్మకొండ
ఈ నెల 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలనే చిరకాల వాంఛను వెంటనే తీర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇల్లందుల రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వ ర్యంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. 1997 నుండి ఎస్సీ వర్గీకరణ కోసం బిజెపి మద్దతిచ్చి చట్టసభల్లో అనుకూలంగా మాట్లాడిందన్నారు. అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన బీజేపీ హామీని విస్మరించిందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడ స్వామి జిల్లా ఉపాధ్యక్షులు, జన్ను సంజీవ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల రాకేష్, ఖాజిపేట్ మండల అధ్యక్షులు కొడవటి తిరుపతి ,అనిల్ కుమార్, వెంకన్న, రమేష్ రాజు పాల్గొన్నారు.