రైతుల పాలిట ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌

CM KCR is a supporter of farmers– బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శిరీష ఓం ప్రకాష్‌ యాదవ్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌
రైతుల పాలిట సీఎం కేసీఆర్‌ ఆపద్బాంధవుడు అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, డాక్టర్‌ శిరీష ఓం ప్రకాష్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ రుణ మాఫీ ప్రకటించడం పట్ల గురువారం నగరంలోని కాచిగూడలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, డాక్టర్‌ శిరీష ఓం ప్రకాష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు ఎర్ర భీష్మ దేవ్‌, సీనియర్‌ నాయకులు బద్దుల రవీందర్‌ యాదవ్‌, ధాత్రిక్‌ నాగేందర్‌ బాబ్జి, సదానందు, బబ్లు సింగ్‌, రాజేష్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.