ఉద్యమ గాయకులు సాయిచంద్‌కు.. సీఎం ఘన నివాళి

నవతెలంగాణ -వనస్థలిపురం
తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకులు సాయిచంద్‌కు సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని జీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన సాయిచంద్‌ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరై సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాలతో నివాళులర్పించారు. సాయి చంద్‌ సతీమణికి ధైర్యాన్ని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, జగదీష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న, మండలి చైర్మెన్‌ గుత్తా సురేందర్‌ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు దేవి రెడ్డి సుధీర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డితోపాటు వందలాది అభిమానులు విచ్చేసి చిత్రపటానికి నివాళులర్పించారు.

Spread the love