సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఉద్యమ కాలంలో గ్రూప్‌-1 రాయకుండ్రి, మనరు మనమే రాసుకుందామంటూ రెచ్చగొట్టిన కేసీఆర్‌..స్వరాష్ట్రంలో కొలువులు ఎక్కడికి పాయే అని విమర్శించారు. తొమ్మిదేండ్లు గడిచినా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 503 పోస్టులకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించి వాటిన రద్దు చేసిన ఘటన ఇక్కడే జరగిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం మానుకోవాలని హితవు పలికారు.