నిరుపేదలకు నీడ కల్పించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

– ప్రభుత్వచీఫ్‌విఫ్‌ వినరుభాస్కర్‌
నవతెలంగాణ-హన్మకొండ
రాష్ట్రంలోని నిరుపేదలకు నీడకల్పించడమే ము ఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దా స్యం వినరుభాస్కర్‌ అన్నారు. గురువారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం లోని అంబేద్కర్‌నగర్‌, సాయి నగర్‌, శ్రీనివాస్‌కాలనీల్లోని గుడిసెవాసులకు దాస్యం ఇళ్ల స్థలాల పట్టాల పంపి ణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కు గూడు, నీడ కల్పించా లనే సీఎం కేసీఆర్‌ జీవో నెం 58ను జారీ చేశారన్నా రు.నియోజకవర్గంలోని గుడిసెవాసులు 40ఏళ్ల ని రీక్షణను కెేసీఆర్‌ నెరవేర్చారని కొనియాడారు. 75 ఏళ్ల కాంగ్రెస, బీజేపీలు పాలించినా నిరుపేదలను ప ట్టించుకున్న పాపానపోలేదన్నారు. నిరుపేదలకు భ ద్రతా, భరోసాను కల్పిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్ప టికే చాలామందికి 58 జీవో పట్టాల ను అందించడం జరిగిందన్నారు. మొన్న పోచ్చమ్మకుంటలో పట్టాల పంపిణీ ఒక పండగ వాతావరణం సంతరించుకుం దని నేడు అంబేద్కర్‌నగర్‌, సాయినగర్‌, శ్రీనివాసకా లనీల్లో ఇళ్లపట్టాలను పంపిణీ చేయడం చాలా ఆనం దంగా ఉందన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికీ హక్కు క ల్పించాలనే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నా నని గత ప్రభుత్వాలు నిరుపే దలకు కనీస మౌలిక వ సతులు కల్పించలేక పోయాయని ఆవేదన వ్యక్తంచేశా రు. అర్హులైన పేదలు ప్రతి ఒక్కరూ 58 జీవో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లోటుపాట్లుఉంటే అధికారు లతో సమన్వయం చేసుకొని హక్కు కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. గురువారం 54 ఇళ్లకు పట్టాలు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో వాసుచందర్‌, తహశీల్దార్‌ రాజ్‌కుమార్‌, డివి జన్‌ అధ్యక్షులు పొడిశెట్టి అనిల్‌, నాయకులు కారు ఉపేందర్‌, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.