నవతెలంగాణ – తాడ్వాయి
వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీఆర్ఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు సాయిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు విద్యార్హతలను బట్టి నచ్చిన శాఖల్లో ఉద్యోగం చేసే విధంగా వెసులుబాటు కల్పించడం ఆనందంగా ఉందని వీఆర్ఏలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్,ఏ డిప్యూటీ తాసిల్దారులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు జనగాం సాంబయ్య, నాలి నాగేశ్వరరావు, చెన్నూరి కన్నయ్య, నారాయణ, చంద ప్రవీణ్, పుర్రి రమేష్, చందా సబిత వీఆర్ఏలు పాల్గొన్నారు.