సీతా రంజిత్‌రెడ్డికి సీఎం శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యురాలుగా నామినేట్‌ అయిన గడ్డం సీతారంజిత్‌రెడ్డి శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు సీఎంకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంను కలిసిన వారిలో ఆమె భర్త, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌ రెడ్డి, కుమారుడు రాజ్‌ ఆర్యన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.