కులమతాలకు అతీతంగా పూజలు చేస్తున్న కోఆప్షన్ నెంబర్ బులెట్ అక్బర్ ఖాన్

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి:

కుల మతాలకు అతీతంగా కోఆప్షన్ నెంబర్ బులెట్ అక్బర్ పూజలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. జక్రాన్ పల్లి మండలానికి కేంద్రానికి చెందిన బుల్లెట్ అక్బర్ ఖాన్ పార్టీలకు అతీతంగా కులమతాలకు అధికంగా అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అక్బర్ ఖాన్ గుర్తించి మండల కో ఆప్షన్ నెంబర్ గా అవకాశము కల్పించారు. కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ వినాయక పూజల్లో పాల్గొంటూ అందరితో కలుపుగోలుగా తిరుగుతూ అందరి మనలను పొందుతున్నారు. ప్రస్తుతము దుర్గాదేవి మండపాల వద్ద కూడా ప్రజాప్రతినిధులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కుల మతాలకు అతీతంగా వారితో కలిసి భోజనం చేస్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్ చర్చిలలో కూడా ప్రత్యేక ప్రార్థనలు పాల్గొంటూ అందరితో కలుపుగోలుగా ఉంటూ, తనకు తోచిన సహాయము అందజేస్తూ తన వద్దకు వచ్చిన వారికి పలు సూచనలు సలహాలు అందజేస్తూ ఇటువంటి లాభపేక్ష ధనార్జన లేకుండా ఇతరులకు మాట సహాయము అందజేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. రాజకీయంగా ఎదుగుతూ అందరితో ప్రేమతో జీవనము కొనసాగిస్తున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొంటూ, దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొంటూ, వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని కులమత బేధము లేదు అనే నినాదాన్ని ప్రజలకు సందేశాన్ని అందిస్తున్నారు.