వాయ్ నాడు బాధితుల కొరకు విరాళాల సేకరణ

వాయ్ నాడు బాధితుల కొరకు విరాళాల సేకరణ– 13381/- రూపాయలను విరాళంగా సేకరించిన సిపిఎం నాయకులు
నవతెలంగాణ-గోవిందరావుపేట : కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ వరద బీభత్సం వల్ల దెబ్బతిన్న వారి సహాయార్థం సిపిఎం నాయకులు గురువారం మండలంలోని పసర గ్రామంలో ఉదారంగ విరాళాలు సేకరించారు. సిపిఎం పార్టీ పసర గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు మరియు మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 13,381 రూపాయలను దాతల ద్వారా విరాళాలుగా సేకరించినట్లు వారు తెలిపారు. ఇంకా మానవతా దృక్పథంతో సహాయం చేయదలచిన వారు తమను సంప్రదించి హితోదికంగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వాయనాడు వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందిద్దామని అన్నారు. ఈ సందర్భంగా విరాళాలు అందించిన దాతలకు వ్యాపారులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పొదిల చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి ,గొంది రాజేష్, పల్లపురాజు, బ్రహ్మచారి, అశోక్, సూర్యనారాయణ, కవిత, సీత, రాజేశ్వరి, అరుణ్, జీవన్, అరవింద్, గంగరాజు, ఉపేందర్, రవి, శ్రీనివాస్, కృష్ణ, అశోక్, బ్రహ్మచారి, సరిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు