
నవ తెలంగాణ- జక్రాన్ పల్లి : మెరి మట్టి మేరీ దేశ్ లొ భాగంగా జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామంలో 5 ఇండ్లను సందర్శించి వారి నుండి కొంచెం బియ్యము సేకరించడం జరిగిందని గ్రామ సర్పంచ్ మహేశ్వర్ తెలిపారు. సేకరించిన బియ్యాన్ని జక్రాన్ పల్లి మండల కార్యాలయమునకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేశ్ పల్లి గ్రామ సర్పంచ్ మైదం మహేశ్వర్, ఉపసర్పంచ్ మోత్కూరి భాస్కర్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు మున్నూరు గంగాధర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.