– ఆర్భాటంగా సెప్టెంబర్ 15న వైద్య కళాశాల ప్రారంభం
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో ఆర్భాటంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం జిల్లాలో నిర్మింస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి పరిశీలించారు.జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 100 ఎం.బీ.బీ.ఎస్. సీట్లతో వైద్య కళాశాల 2022 లో మంజూరు చేసిందని అన్నారు. వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సెప్టెంబర్ 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆన్ లైన్ విధానంలో వైద్య కళాశాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో 5 ఎకరాలలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశామని, మొదటి సంవత్సర తరగతి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఫర్నిచర్ హాస్టల్ వసతి త్రాగునీటి సరఫరా అధ్యాపకులు సమకూర్చడం జరిగిందని తెలిపారు. జిల్లాకు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి కళాశాలలో చదివేందుకు ఆసక్తి చూపారని కలెక్టర్ అన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో 8 నూతన వైద్య కళాశాలలో ప్రారంభించుకున్నామని, ఈ సంవత్సరం మరో 9 వైద్య కళాశాలలో ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు మెడిసిన్ చద వాలని, విదేశాల చదువుకు స్వస్థి పలికి,ఆరోగ్య తెలంగాణ రాష్ట్రం గా తీర్చి ద్దేందుకు సీఎం కేసీఆర్ నాంది పలికారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోంత నిధులతో మెడికల్ కాలేజ్ లను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలం గాణ మాత్రమేనని, మన వైద్య కళాశాలలో గుజరాత్, మహారాష్ట్ర నుంచి విద్యార్థులు రావడం మన ఖ్యాతికి చిహ్నమని అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వైద్య కళాశాలలో విద్య నేర్పేందుకు పూర్తిస్థాయిలో అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని, మొదటి సంవత్సరపు తరగతుల నిర్వహించేందుకు అవసరమైన లెక్చరర్ ,హాల్స్, ల్యాబ్ మొదలగు ఏర్పాటు చేశామని అన్నారు.ఇప్పటికే కాలేజ్ లో మెడిసిన్ చదవడానికి 100మంది విద్యార్థులకు అడ్మిషన్లు జరిగాయని తెలిపారు. సెప్టెంబర్ 15న భూపాలపల్లి లో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణం లో భూపాలపల్లిలోని హనుమాన్ ఆలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని ఇందులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్, మున్సిపల్ చైర్ పర్సన్, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. సెప్టెంబర్ 15న జరిగే ఈ మహౌత్తర సన్నివేశానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు,ప్రజా ప్రతినిధులు, అధికారులు,విధార్థులు అందరూ రావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజ్ దేవ్ డే, మెడికల్ సూపేరెండెంట్ నవీన్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.