సిరిధాన్యాలతో చాలా ఉపయోగాలు ఉంటాయి: కలెక్టర్

– తాడ్వాయి లో ఘనంగా పోషణ పక్ష కార్యక్రమం
నవతెలంగాణ – తాడ్వాయి
సిరి ధాన్యాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయని, నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ములుగు జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లులు, గర్భవతులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అదేవిధంగా ఆరు నెలల బాలబాలులకు అన్న ప్రసన్న కూడా నిర్వహించారు. తల్లుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలు లభ్యమయ్యే మంచి పోషకాహరం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లి గర్భం నుంచి మొదలుకొని బిడ్డకు రెండు సంత్సరాలు వచ్చేవరకు మంచి పోషాకాహరం తీసుకోని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో కిచెన్ గార్డెన్ పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా బుధవారం రోజున కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కి మీరే గ్రూప్స్ వైస్ గా ఎవరేమీ ఏమేమి వంటకాలు చేసుకొని వస్తారో వాటిని తీసుకొని రావాల్సిందిగా ఉంటుంది అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల శ్రేజ ప్రి స్కూల్ పిల్లలకు అందించే పుస్తకాలను, ఆట వస్తువులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో ఎర్పాటు చేసిన చిరుధాన్యాల పదర్శనను కలెక్టర్ తిలకించారు. జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన్ గారు మాట్లాడుతూ,  అంగన్వాడీ కార్యకర్తలు పిల్ల లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో మహిళ లు, గర్భిణులు, కిశోర బాలికల్లో ఉన్న రక్త హీనత శాతాన్ని తగ్గించేందుకు అంగన్వాడీ టీచర్లు, కార్యక ర్తలు కృషి చేయాలని అని అన్నారు. అనంతరం  ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అప్పయ్య, డాక్టర్ రణధీర్, స్థానిక తహసిల్దార్ రవీందర్, సిడిపిఓ జి మల్లేశ్వరి, సూపర్వైజర్స్ విజయ, శారద, పోషణ అభియాన్ శ్రావణి, శిరీష, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి జ్యోతి, రజిని, శిరీష మరియు అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.