నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్ని కల అధికారి ఇలా త్రిపాఠి కోరారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు లో జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి, రిటర్నింగ్ అధికారి అంకిత్ తో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవ ర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉల్లం ఘనలపై నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, రిటర్నింగ్ అధికారి కార్యా లయంలో ఫిర్యాదు చేయవచ్చని, సి-విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చని, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు నమోదు చేయవచ్చని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సి-విజల్ యాప్ లో నమోదైన ఫిర్యాదులను 100 నిమిషాలలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ప్రస్తుతం ఉన్న పనులు, పథకాలు మాత్రమే కొనసాగుతాయని కొత్త పనులు, పథకాలు ప్రారంభించడం జరగ దని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, సువిధా యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని , రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని ఎన్నికల అధికారి తెలిపారు. మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123, ఐపిసి సెక్షన్ 171 ప్రకారం అభ్యర్థులపై 6 సంవత్సరాలు నిషేదం ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. అక్టోబర్ 31 వరకు నూతన ఓటరు నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఓటరు జాబితాలో పేర్లు లేకుండా ఎవరైనా అర్హులైన ఓటర్లు ఉంటే వెంటనే దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కువమంది సమావేశాలు నిర్వహణకు పోటీ పడితే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. సామాజిక మాధ్యమాలలో విద్వేషాలను పెంచే విధంగా పోస్టులు పెట్టడం,ఇతరులను దూషించడం, బెదిరింపులకు గురి చేయడం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న, ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, వివిధ రాజకీయ నాయకుల ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ సకినాల శశికాంత్, బిజెపి పార్టీ సి హెచ్ భాస్కర్ రెడ్డి, శ్రీమంతుల రవీంద్ర చారి, కాంగ్రెస్ పార్టీ యం డి.చాంద్ పాషా,గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బొమ్మ కంటి రమేష్, మర్రి రాజు, సిపిఎం పార్టీ కొర్ర రాజు ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంధ్య రాణీ, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ విజరు కుమార్, అనిస్ ఫాతిమా, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా దళిత అభివద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతిపై జిల్లా లోని, ఏటూర్ నాగారం, ములుగు, సబ్ డివిజన్‌ల వారీగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆమె తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందే విధంగా చూడాలన్నారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దష్టిని కేంద్రీకరించాలని సూచించారు. విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు, తద్వారా సమస్యలు జిల్లా యంత్రాంగం దష్టికి వచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ నెల తప్పనిసరిగా గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించేలా చూడాలని తాసిల్దార్లను ఆదేశించారు. జిల్లా ఎస్పి గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో ఎస్సి, ఎస్టి లపై అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యల తీసుకుంటున్నామని తెలియచేసారు. ఎస్సి, ఎస్టీ ల పై అట్రసిటీ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆధారాలు బలంగా ఉన్న కేసుల్లో శిక్షలు పడుతున్నాయని ఈ కేసుల విషయంలో అవసరమైతే కేసులను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళలపై వేధింపుల నివారణకు ప్రతి శాఖలోను ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని . పోలీస్ శాఖ తరపున షీ టీమ్ క్రియాశీలకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే ఎస్ సి, ఎస్టి కేసుల విషయంలో ఏ విధమైన వివక్షత లేకుండా కేసులను నమోదు చేసి నింతుల పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తమ అధికారులకు సైతం ఆదేశించానని చెప్పారు. ఈ కేసుల సత్వర పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో ఎస్సి, ఎస్టి కేసులపై ప్రత్యేక దష్టిని పెట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ డి వెంకన్న, ములుగు ఆర్డీవో సత్యపాల్,డివిహెచ్‌ఓ విజయభాస్కర్, ఏటూర్ నాగారం ఎఎస్పి,సిరిశెట్టి సంకీర్త్ ములుగు డిఎస్పి రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డిఎం అండ్ హెచ్ ఓ,అల్లెం అప్పయ్య, డీఈవో పాణిని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ చుంచు రవి, నక్క బిక్షపతి, రాస మల్ల సుకుమార్, మహేష్ నాయక్, వివిధ మండల తహసిల్దారులు ఎంపీడీవోలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.