జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం నాడు  జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రజా పరిషత్ పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా జిల్లా కలెక్టర్  బాధ్యతలు చేపట్టారు.  ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కు కేటాయించబడిన ముగ్గురు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు రికార్డ్ అసిస్టెంట్ పదోన్నతి ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్ శోభారాణి, డిప్యూటీ సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ సూపర్డెంట్లు కే. రమేష్ రెడ్డి, సుధాకర్, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు.