సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నేడు కలెక్టర్ల సదస్సు

– రాష్ట్ర అవతరణ వేడుకలు, హరితహారం, పోడు పట్టాల పంపిణీపై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం కలెక్టర్ల సదస్సు జరగనున్నది. ఉదయం 11 గంటలకు డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో జరిగే సదస్సుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిష నర్లు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలు, హరితహారం అమలు, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం సమీక్షించ నున్నారు. కలెక్టర్ల సదస్సుకు మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ వినోద్‌కుమార్‌ హాజరు కానున్నారు.