– కేసీఆర్‌కు బ్రహ్మానందం దంపతుల ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లో జరగబోయే తమ కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా బ్రహ్మానందం దంపతులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో వారు సీఎంను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భం గా ఆ దంపతులకు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.