
నవతెలంగాణ- డిచ్ పల్లి
సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో నిర్వహించే మండల స్థాయి క్రీడలకు ముఖ్యఅతిథిగా హాజరు కావలని ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను కోరారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంఘం ప్రతినిధులు బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డికి ఆహ్వానం పలికారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తప్పకుండా మండల స్థాయి క్రీడలకు హాజరవుతానని హామీనిచ్చారు. ఆయనను కలిసిన వారిలో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ , మండల అధ్యక్షులు చిలువేరి దాస్, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, విండో చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కుమ్మరి మోహన్, మాజీ ఎంపీటీసీ గంగాధర్ గౌడ్, హెచ్ఎం సూర్యనారాయణ, పాఠశాల చైర్మన్ నామాల గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ ముత్తెన్న, వీడీసీ సభ్యులు ఎం. శ్రీనివాస్, రూరల్ ఎస్సీసెల్ కన్వీనర్ పాశంకుమార్, గౌడ సంఘం నాయకులు ప్రసాద్ గౌడ్, పీఈటీ రాజకుమార్ తదితరులున్నారు.