వినూత్నంగా పూర్ణకుంభంతో అమరవీరుల సంస్మరణ

మేరా దేశ్ మేరా మట్టి
మేరా దేశ్ మేరా మట్టి
రేవల్లి నవతెలంగాణ ;
వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండల కేంద్రంలో శుక్రవారం రోజు”మేరా దేశ్ మేరా మట్టి” అను నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షులు అజయ్ గౌడ్, ఉపాధ్యక్షులు వడ్డే రామ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, బి. కృష్ణ, దేశ రక్షణ కొరకు ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం కార్యక్రమం చేపట్టడం జరిగింది అని తెలిపారు. కార్యక్రమంలో మండల బీజేపీ ఇన్ చార్జ్ పరశరామ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనుజ్ఞ రెడ్డి, రేవల్లీ బూత్ అధ్యక్షులు లింగస్వామి, నారాయణ, తిరుపతి నాయక్, జమ్ములు, శ్రీశైలం, తిరుపతయ్య, రాముశివ తదితరులు పాల్గొన్నారు.