నిర్మల్‌ బస్టాండ్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌

– ఫంక్షన్‌హాల్‌, దుకాణ సముదాయాల నిర్మాణం
– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిర్మల్‌ బస్టాండ్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల్ని వేగంగా చేపట్టాలని మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి అధికారుల్ని అదేశించారు. శనివారం బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంత్రితో టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్‌ బస్టాండ్‌లో చేపడుతున్న నిర్మాణాల గురించి వివరించారు. రూ.35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో ఫంక్షన్‌హాల్‌తో పాటు 53 దుకాణ సముదాయాలు కూడా ఉంటాయని వివరించారు. 1.3 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఈ కాంప్లెక్స్‌ను సెల్లార్‌తో పాట జీ ప్లస్‌ వన్‌ గానిర్మిస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల టీఎస్‌ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈ వినోద్‌కుమార్‌, సిటిఎం విజరుకుమార్‌, సీసీఈ రాంప్రసాద్‌, సివిల్‌ ఇంజనీర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.