– మత్తత్వవాదులను ఓడించాలి
– సీపీఎం పిలుపు
నవతెలంగాణ- కంఠేశ్వర్: కమ్యూనిస్టులను ప్రజాస్వామిక వాదులను గెలిపించాలి అని మతతత్వవాదులను ఓడించాలి అని సీపీఎం నిజామాబాద్ జిల్లా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం కి కార్యాలయంలో నిర్వహించటం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులను చర్చించి రాబోయే ఎన్నికల్లో పార్టీ తీసుకునే ఎత్తుగడలను నిర్ణయించడం జరిగిందిఅని అదేవిధంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మత్తత్వవాదులను ఓడించటానికి లౌకిక శక్తులను బలపరచడంతో పాటు పార్టీ నిర్ణయించిన వ్యక్తులకు పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు. ప్రజాసంఘాల కార్యకర్తలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా సిపిఎం పార్టీ పోటీ చేసే 19 స్థానాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేయోభిలాషులు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించటం తో పాటు రైతాంగం, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించే వారికి వారికి తగిన భద్రతా రక్షణ కల్పించే వారికి ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, పలుపు వెంకటేష్, పెద్ది వెంకట్ రాములు, తో పాటుగా సుజాత, నన్నేసాబ్, కొండ గంగాధర్, జంగం గంగాధర్, పెద్ది సూరి తదితరులు పాల్గొన్నారు.