టౌన్ 6 పి.యస్ పరిధిలో కమ్యూనిటి కాన్టక్టు ప్రోగ్రామ్…

నవతెలంగాణ -కంటేశ్వర్
నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్, ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 6:00 గంటల నుండి 8:00 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని టౌన్ 6 పి.యస్ పరిధిలో బిలాల్ నగర్ కాలనీలో ( జన్నే పల్లి ఎక్స్ రోడ్డు) అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎమ్. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటి కాన్హక్టు ప్రోగ్రామ్ కార్యాక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిదిలో దాదాపు 100 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి వాహనాదారుల వాహనాల డాక్యూ మెంట్లు ఉన్నాయ లేదా అని వారిని ఆరాతీయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటికాగితాలు / నెంబర్ ప్లేట్లు లేని మొత్తం ద్విచక్ర వాహనాలు 67, ఆటోలు 24 స్వాధీనం చేసుకొవడం జరిగింది.ఈ సందర్భంగా అసిస్టెంటు కమీషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ మీడియాను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నిజామాబాద్లోని ప్రజలతో సత్సంబందాల కోసం ఈ కమ్యూనిటి కాన్హక్టు ప్రోగ్రామ్ నిర్వ హింస్తున్నామని, ప్రధానంగా వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వాహానాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాల ని, సైబర్ నేరాలు చేసే వారి ఊచ్చులో పడకూడదని, ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మన సమాచారం అడిగినట్లయితే ఎవ్వరికి ఇవ్వరాదని, పిల్లలకు ఫోన్లు ఇవ్వరాదని, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామనిమన బ్యాంక్ సమాచారం అడిగిన ఎవ్వరికి ఇవ్వరాదని, లక్కీడ్రా పేరుతో ఎవ్వరికి డబ్బులు ఇవ్వరాదని, ఎవ్వరూ కూడా ఆన్లైన్ ఫ్రాడింగ్ మోసాలకు గురికావద్దని, ఎవ్వరయిన మోసానికి గురి అవుతేవారు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని లేదా డయల్ 100 లేదా 1930 కు సంప్రదించాలని, ఎవ్వరు కూడా ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని, కొత్త వ్యక్తులకు ఇంటిని కిరాయికి ఇచ్చేటప్పుడు వారి యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరువారి వారి పరిధిలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకురావాలని, ఈ సి.సి కెమెరాల ఏర్పాటు వలన నేరగాళ్ల గుట్టురట్టులో ఎంతో దోహాదపడుతున్నాయని, సి.సి కెమోరాల వలన ఇప్పటి వరకు ఎన్నోదొంగతనాలకు పాలుపడిన నేరగాళ్లను కిడ్నాప్డ్కేసులో నిందితులను ఎంతోసులువుగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఎవ్వరయిన తప్పుడు పనులు చేస్తున్నట్లు సమాచారం తెలిసిన వారు ముందుగా సంబంధిత పోలీస్ వారికి తెలియజేయాలని అటువంటి వారికి ముందస్తుగా కౌన్సిలింగ్ నిర్వ హిస్తామని, వారు మారనట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎవ్వరూ కూడా శాంతి భద్రతలకు ఎవరూ విఘాంతము కలిగించరాదని అన్నారు. ఎవ్వరూ కూడా గంజాయి వాడకం చేయకూడదని, గంజాయి వలన ఆరోగ్యం దెబ్బతింటుందని, గంజాయికి సంబంది చిన సమాచారాం తెలిసినట్లయితే వారు దగ్గరలోని పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. సైబర్ నేరాల నుండి ప్రజలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని, లోన్ యాప్లు ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోరాదని, వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఎవ్వరివైన ఫోటోలు ఉపయోగించి ఆపదలో ఉన్నమని డబ్బులు తొందరగా పంపుమంటే పంపకూడదూ, దానికోసం ఫోన్చేసి పూర్తి విషయాలు కనుక్కోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా సి.ఐ లు 06 మంది, ఎస్.ఐ.లు 10 మంది, ఎ.ఎస్.ఐలు / హెడ్ కానిస్టే బుల్స్ కానిస్టేబుల్స్ / మహిళా పోలీస్ / మహిళా హోమ్ గార్డులు 90 మంది పోలీస్ సిబ్బంది మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.