బోర్గాం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్, 45 వాహనాల సీజ్

– బోధన ఏసిపి కిరణ్ కుమార్
నవతెలంగాణ- నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రెంజల్ మండలం బోర్గం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేయగా 45 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో వాహనదారులు సరియైన పత్రాలను దగ్గరగా ఉంచుకోవాలని, గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆయన పేర్కొన్నారు. రాబోవు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్ రాజ్, రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్, ఎడపల్లి ఎస్సై విక్రం, రుద్రూర్ ఎస్సై నిరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.