నిరాదార ఆరోపణలతో కించపరుస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు

నవతెలంగాణ- నవీపేట్: నాయక్ కోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రాంచందర్ పై యూట్యూబ్ ఛానల్ మాధ్యమికంగా నిరాహార ఆరోపణలు చేస్తున్న కట్ట నరేష్ పై మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎస్సై యాదగిరి గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసత్య ఆరోపణలు చేస్తున్న డిచ్ పల్లి కమలాపూర్ కి చెందిన ముత్యాల నరేష్ ని ప్రశ్నించగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు రమణ, ఇంగోలి సాయిలు, గంగాధర్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.