పౌష్టికాహారంతోనే గర్భిణీలకు సంపూర్ణ ఆరోగ్యం 

– ఐసీడీఎస్ సీపీడీఓ జయమ్మ
నవతెలంగాణ-బెజ్జంకి 
పౌష్టికాహారంతోనే గర్భిణీలకు సంపూర్ణ ఆరోగ్యమని,అంగన్వాడీ కేంద్రం ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సీపీడీఓ జయమ్మ తెలిపారు. మంగళవారం మండల కేందరంలోని 2వ అంగన్వాడీ భవనంలో  తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు.పుట్టిన వేంటనే శిశువుకు తల్లిపాలు పట్టించాలని, తల్లిపాలు పిల్లలకు శ్రేయస్కరమని జయమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్లు నాగరాణి, కవిత, అంగన్వాడీ ఉపాద్యాయులు జయ, భూదేవి, కనకలక్ష్మి పాల్గొన్నారు.