పూర్తయిన కానిస్టేబుల్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ

– జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి
నవతెలంగాణ- వనపర్తి
కానిస్టేబుల్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రక్షిత కె మూర్తి ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ రామదాసు తేజావత్‌ ఆధ్వర్యంలో రెండవ రోజు కానిస్టేబుల్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగింది. శుక్రవారం 104 మంది అభ్యర్థులకు వెరిఫికేషన్‌ ఉండగా అందులో టిఎస్‌ఎస్‌పి అభ్యర్థులు 75 ఉండగా ఒక్కరు గైర్హాజరయ్యారు. 17 మంది ఫైర్‌ అభ్యర్థులు రావాల్సి ఉండగా అందరూ హాజరయ్యారు, ఒక్కరు జైలు వార్డెన్‌ అభ్యర్థులు ఉండగా ఒక్కరు హాజరయ్యారని తెలిపారు. 06 ఐటి అండ్‌ కమ్యూనికేషన్‌ అభ్యర్థులు, 04 ఎక్సైజ్‌ అభ్యర్థులు, ట్రాన్స్పోర్ట్‌ అభ్యర్థి ఒక్కరు ఉండగా అందరూ హాజరయ్యారు వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మొదటిరోజు సివిల్‌/ ఏర్‌ 131 అభ్యర్థులకు మొత్తం అభ్యర్థులు హాజరయ్యారు. హాజరైన వారందరి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి అయినట్లు ఏ ఎస్‌ పి తెలిపారు. అభ్యర్థులందరికీ ప్రక్రియలో భాగంగా అనంతరం మెడికల్‌ టెస్టులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ తాజ్‌ ద్దిన్‌, సూపర్డెంట్‌ ఇంతియాజ్‌, కార్యాలయ సిబ్బంది అశోక్‌ శెట్టి, మధు, పర్వేస్‌ , ప్రశాంత్‌, వినరు , ఆనంద్‌ రెడ్డి , రాము, అజరు కుమార్‌, స్వామి, శిరీష అఖిల రిజర్వ్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీ అప్పలనాయుడు గారు సిబ్బంది పాల్గొన్నారు.