తెలంగాణ రాష్ట్రంలోనే మైనార్టీల సమగ్రాభివృద్ధి

– దాస్యంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆత్మీయసమ్మేళనంలో హోంమంత్రి మహ్మద్‌అలీ ముస్లీంలకు పిలుపు
నవతెలంగాణ-హన్మకొండ
ముస్లిం మైనార్టీల సంక్షేమే లక్ష్యంగా కే సీ ఆర్‌ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి మహమ్ముద్‌ఆలీ అన్నారు. తెలం గాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత పదేళ్లుగా ముస్లిం మైనారి టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ చేసిన అభివద్ధి మరువరాని దన్నారు. మంగళవారం జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో మహమ్మద్‌ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గత 50 ఏళ్లుగా కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ముస్లిం మై నార్టీలకు చేసిందేమీలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ నాయ కత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పా టుచేసి నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తు న్నారని అన్నారు. ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ లాగా షాదీ ముబారక్‌ ద్వారా రూ.1,10016 లను ఇస్తున్నారని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి కేసీఆర్‌ ఓవర్సీస్‌ పథకంలో 3300 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీల సంక్షేమం ధ్యేయంగా కేసీఆర్‌ ప్రభుత్వం పని చేసిందని ఆయన గుర్తు చేశారు. బిజెపితో బీఆర్‌ఎస్‌ అంతర్గత సంబంధాలు ఉన్నాయ ని వస్తున్న ఆరోపణలో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు.డిసెంబర్‌ 3 తర్వాత తెలం గాణలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5000 కోట్లతో ముస్లిం మైనారిటీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సీఎం కేసీఆర్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. అచ్యువ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని దాస్యం వినరుభాస్కర్‌ కు మైనారిటీలంతా ఐక్యతతో పనిచేసి భారీ మెజారిటీ ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ పశ్చిమ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినరు భాస్కర్‌ మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో మైనార్టీల పాత్ర ఎంతో ఉందని ఆయన కొని యాడారు.అందుకోసం మైనార్టీలకు తాను అండగా ఉంటూ వచ్చానని ఆయన గుర్తు చేశారు. తాను అన్ని మతాలకు గౌరవం ఇస్తానని తాను గుడికి, మసీదుకి, చర్చికి వెళ్తా నని అన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా లేక అనేక ఆరోపణలు చేస్తున్నారని, అందు లో ఏ ఒక్కటి నిజం లేదని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర నాది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవితమంతా రాజకీయం కోసం కాదని ఆపదలో ఉన్నవారికి ఆదుకునే విధంగా ఉండాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా సేవలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు తనను గెలిపించడానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.మీకు అండగా ఉన్నానని,భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాలు సేవ చేస్తానని అన్నారు. మైనారిటీ నాయకులు అతిధులను శాలువాతో సన్మానించి, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మహమ్మద్‌ కుదూస్‌ సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల నుండి 300 మంది వివిధ పార్టీల నుండి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు వారికి హోంమంత్రి మహమ్మద్‌ ఆలీ మరియు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినరు భాస్కర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్‌ మౌలానా యూసఫ్‌ జాహిద్‌,వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ జనార్దన్‌ గౌడ్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ మైనా రిటీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నయీముద్దీన్‌, జహీర్‌, బ్లూ బర్డ్‌ విద్యాసంస్థల కార్యదర్శి అబ్దుల్‌ మాజీద్‌, మౌలానాసయ్యద్‌, మసూద్‌ మహమ్మద్‌, ఖాసింఖాన్‌, మహ మ్మద్‌ అబ్దుల్‌, ఖుద్దూస్‌, అన్వర్‌, కల్పలత సూపర్‌ బజార్‌ వైస్‌ చైర్మన్‌ షఫీ, మహమ్మద్‌, అఫ్జల్‌,సోనీ, బియా బని, హుస్సేన్‌, ఖలీల్‌, మహమ్మద్‌ షరీఫ్‌, మమ్మద్‌ అన్వర్‌, తస్లీమా కౌర్‌, ఇస్మాయిల్‌, రజియా, రిజ్వానా, సత్తార్‌ , కరీమున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.