సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల సమగ్ర సమాచారం సేకరించాలి

– కేంద్ర ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు రాజేష్‌కుమార్‌
నవతెలంగాణ-వరంగల్‌
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల స మగ్ర సమాచారం సేకరించాలని కేంద్ర ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు రాజేష్‌ కు మార్‌ అన్నారు. మంగళవారం వరంగల్‌ (తూర్పు)-106 నియోజక వర్గ పరిధి లో గుర్తించబడిన సమస్యాత్మక పోలింగ్‌ కేం ద్రాలను పోలీస్‌ పరిశీలకులు క్షేత్ర స్థా యిలో పరిశీలించి సమర్ధఏర్పాట్లకు అదికారులకు తగుసూచనలు చేశారు. ఈ సందర్భంగా కొత్తవాడలోని ఏకశిలాస్కూల్‌, తుమ్మలకుంటలోని ప్రగ తి స్కూల్‌, మండిబజార్‌ ప్రాంతంలోని కిడ్డీ స్కూల్‌, సుఫాస్కూల్‌, ఎల్లం బజార్‌ లో గల పూర్ణోదయ స్కూల్‌, ఖిల్లా వరంగల్‌ ప్రాంతంలో గల ఆరెల్లి బుచ్చయ్య పాఠశాల, పెరుకవాడలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో గల పోలింగ్‌ కేంద్రాలను పోలీస్‌ ఆబ్జర్వర్‌ పరిశీలించారు. అనంతరం పోలీస్‌ ఏసీపీ బోనాల కిషన్‌ క్రిటికల్‌ పో లింగ్‌ కేంద్రాల గురిం చి తెలియజేస్తూ వరంగల్‌ (తూర్పు) ని యోజక వర్గంలో మొత్తం 230 పోలింగ్‌ కేంద్రాలలో 57 కేంద్రాలను క్రిటికల్‌ పో లింగ్‌ కేంద్రాలుగా గుర్తించడం జరిగిం దని తెలిపిన క్రమంలో పోలీస్‌ పరిశీలకు లు మాట్లాడు తూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గురించిన గత నేర చరిత్ర, అట్టి ప్రాంతంలో గల రౌడీషీట్‌ల నేరచరిత్రపై సమాచారం సేకరించాలని, రాజకీయ పార్టీల ప్రాధాన్యం, సునీతత్వం, మిశ్రమ సంస్కృతి ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉ న్నాయో గుర్తించాలని, వాహనాలు సులు వుగా వెళ్లి తిరిగి రావడానికి మార్గాలను అన్వేషించాలని, గుడుంబా,మద్యం తో పాటు వివిధ మత్తు పదా ర్థాల ప్రభావం ఇట్టి ప్రాంతాల్లో ఏమేరకు ఉంటుం దో కనీస అవగాహన కలిగి ఉండాలని, అదనపు బలగాల మోహరింపుపై ప్రత్యేక కార్యాచరణ (ప్లాన్‌ఆఫ్‌యాక్షన్‌) ఉండా లని, ఇట్టి పోలింగ్‌ కేంద్రాలలో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ జరగాలని, రోజువారీ కార్యక లాపాలపై లా, ఆర్డర్‌ ప్రకారంగా తీసు కొన్న చర్యలు, కేసులు నమోదు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసి స్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బోనాల కిషన్‌, సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ లు వెంకటేశ్వర్లు, సురేష్‌ గౌడ్‌తో పాటు పోలీస్‌ పరిశీలకుల లైజన్‌ ఆఫీసర్‌ నిస్సార్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.