ముంబయి : మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ (ఎంఓఎఫ్‌ఎల్‌ఎల్) బ్రోకింగ్ సేవలను విస్తరించడానికి వీలుగా ముంబయిలో ఏర్పాటు చేసిన మోతీలాల్ ఓస్వాల్ బిజినెస్ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ (మోబిక్) 6వ ఎడిషన్ ముగిసిందని ఆ సంస్థ తెలిపింది. జులై 29, 30 తేదిల్లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో భారతీయ ఈక్విటీ మార్కెట్ల గురించి చర్చించినట్టు తెలిపింది. దీనికి తమ 2,000 పైగా భాగస్వాములు హాజరైనట్లు పేర్కొంది. ఈ సందర్బంగా మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ ఎండీ, సీఈఓ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. భారత స్టాక్ మార్కెట్ వృద్థి చెందుతుందన్నారు. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.