
నవతెలంగాణ-గోవిందరావుపేట
నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించండి అని ఆదిలాభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ 50 మందికి పైగా మహిళలు ర్యాలీలో పాల్గొని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఐద్వా కార్యదర్శి కారం రజిత మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి మూడు తరాలు దాటినా, మహిళల తలరాతలు ఏ మాత్రం మారలేదు అన్నారు స్త్రీలు ఇంకా ఏదో ఒకచోట ఏదో ఒక రూపంలో అసమానతలు అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్ర్యం రాలేదనటానికి మన కళ్ళ ముందు జరుగుతున్న సాక్షాత్కారాలని చూస్తే మే నెల నాలుగో తారీఖు మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు గిరిజన మహిళలను వందలాది ప్రజల ముందు పోలీస్ వారి కళ్ళముందు నడివీధిలో నగ్నంగా ఊరేగించారు ఈ మహిళకు సంబంధించిన కుటుంబాల్ని హత్య చేశారు. ఈ సంఘటన కాక ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజే మన రాష్ట్ర రాజధాని నడి వీధిలో రాత్రి పది గంటలకు హైదరాబాద్ పోలీసులు ఒక గిరిజన మహిళను అకారణంగా అరెస్టు చేసి ఆమెపై అత్యంత కిరాతకంగా చిత్రహింస కు పాల్పడినారు ఇలాంటి ఘటనపై మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయ పరమైన చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ప్రభుత్వాలకు గిరిజన మహిళలంటే ఎందుకు ఇంత చులకన ? అంటూ, చంద్రయాన్ త్రీ తో చంద్ర మండలానికి అడుగుడిగిన వైజ్ఞానికత ఒకవైపు ఉండగా ఇంకా కుల మతాల మధ్య వైశ్యామ్యాలు పెంచుతూ, ప్రజల మధ్య మారణ హోమాలు సృష్టించే ప్రభుత్వాలు మరొకవైపు చూస్తున్నాం ఇది ఆధునికత అందామా? అంధకారమందామా ? గిరిజన సంక్షేమానికి మంత్రిగా గిరిజన మహిళనుపెట్టి , దేశ తొలి పౌరురాలుగా గిరిజన మహిళను పెట్టినా ఫలిమేది? సాటి గిరిజన మహిళను ఆదుకోలేని పరిస్థితి. మన ప్రజాస్వామ్య దేశంలో మహిళల హక్కుల్ని కాలరాస్తూ ఇలాంటి పాశవిక చర్యలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె అన్నారు. ఈ ఘటనలను ములుగు జిల్లా ఐద్వా కమిటీగా తీవ్రంగఖండిస్తూ, ఇకనైనా ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించి భాదిత గిరిజన మహిళలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని, లేనిచో అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం భాదిత మహిళలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మంచాల ఐద్వా మండల అధ్యక్షురాలు జిమ్మ జ్యోతి కవిత ఎస్ రాజేశ్వరి స్వరూప స్రవంతి సీత హైమావతి పద్మ కళమ్మ ఈశ్వరమ్మ ఈశ్వరి ప్రమీల సంజన అచ్చమ్మ కైక రాజ్యం తదితర మహిళా సంఘాల నాయకులు మరియు సిపిఎం మండల కార్యదర్శి టి ఆదిరెడ్డి గ్రామ కార్యదర్శి నాగరాజు ఉపేంద్ర చారి రాజు పాల్గొన్నారు.