దిగంబరత్వం

అనాదిగ జరుగుతున్న అకత్యాలు ఆడదానిపై అనునిత్యంగా మారి అవి ఆవేదనకు గురిచేస్తున్నాయి !

అణ్యం పుణ్యం ఎరుగని ఆడవాళ్ళ
మీద గురి పెట్టి పెనుభూతంగా మారి భయపెడుతున్నాయి!

ఆమె చితాభస్మాన్ని నుదుట పూసుకున్న వాళ్ళు దేశభక్తి అనే పేరుతో ఇక్కడే ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్నారు!

నడి వీధిలో ఆమెను వివస్త్రంగా చేసి ఊరేగించిన వాళ్ళు ఏమి ఎరగనట్టు ఆమె దేహంపై జాతీయ జెండాను కప్పి గౌరవిస్తారు!

ఆమె కట్టుకున్న ఒంటి బట్టలను ఉడదీసి అగ్నికి అహుతి ఇచ్చిన వాళ్ళు కనిపించని దేవతను పూజిస్తూ ఆమెను మాత్రం అవమానిస్తారు!

దేశంలో జరిగే ప్రతి సంఘటనకి
ఆమెనే లక్ష్యంగా చేసుకొని
బలిపశువుగా చేసిన వాళ్ళు భేషుగ్గా
భారతదేశన్ని ఏలుతారు!

నగంగా నిలబెట్టిన ఆమె మర్మస్థానం కాదు అది మన జన్మ స్థానం అని తెలియని సోయి తప్పిన వాళ్ళు

ఆమె దిగంబరత్వాన్ని అవమానిస్తూ నమ్మలేని నిజాన్ని ఎప్పటిలా అసత్యాలతో పూడ్చేస్తారు!!
– ఎస్‌. జవేరియా, 9849931255