నవ తెలంగాణ- నవీపేట్: నవీపేట్ గ్రామపంచాయతీ కార్మికుడు గడ్డం ఎల్లయ్య ఆటో ప్రమాదంలో మృతి చెందడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ఆదివారం మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. గడ్డం ఎల్లయ్య శనివారం విధులు నిర్వహించి ఇంటికి వెళుతుండగా వెనుక వైపు నుండి ఆటో ఢీకొనడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఎల్లయ్య అంత్యక్రియల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్, యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు, గంగాధర్, రవి, భూమేష్, పోసాని, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.