పాత్రికేయుడి కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ పత్రిక విలేకరి మిడిదొడ్డి పరుశరాములు తల్లి లక్ష్మీనరసమ్మ ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి పాత్రికేయుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆయన వెంట దండ దేవేందర్ రెడ్డి, పైడిపల్లి కొమురయ్య, కిష్టయ్యతో పాటు తదితరులు ఉన్నారు.