యోగాలో మెడల్స్‌ సాధించిన చిన్నారులకు అభినందనాలు

 ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు
నవతెలంగాణ-దుండిగల్‌
షాపూర్‌ నగర్‌ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగ కేంద్రం చిన్నారులు జాశ్విన్‌, సాహితీ, మానస లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల కేపీ హెచ్బీ కాలనీలో జరిగిన యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చి మెడల్స్‌ సాధిం చారు. ఆదివారం ప్రభుత్వ విప్‌, మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షు లు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు కలిశారు. ఈ సందర్బంగా జాశ్విన్‌కు గోల్డ్‌, సాహితి, మానసకు సిల్వర్‌ మెడల్స్‌ ను ఎమ్మెల్సీ అందజేసి అభినందించారు. భవిష్యత్‌లోనూ జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. అదే విధంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్సీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు మల్లేష్‌, విజరు కుమార్‌, సంపత్‌ గౌడ్‌, హరికష్ణ, సింధు, సంతోష్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.