సమాజ్‌వాదీ పార్టీకి ఏచూరి అభినందనలు

Congratulations to the Samajwadi Partyన్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఘోషిలో జరిగిన ఉప ఎన్నికలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి ఘన విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)కి సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు చేశారు. మతతత్వ సమీకరణలతో ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు బిజెపి చేస్తున్న కుట్రలపై సాధించిన గెలుపుగా ఆయన పేర్కొన్నారు. మైనార్టీలను, దళిత, గిరిజన ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకొని ‘బుల్డోజర్‌’ రాజకీయాలు చేస్తూ మేధావులను, ప్రజాసంఘాల నేతలను వేధింపులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రజలు సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు. ఇందుకు సంబంధించి ‘బుల్డోజర్‌’ను లాక్కెళ్తున్న ‘సైకిల్‌’తో కూడిన కార్టున్‌ను ఆయన తన పోస్టుకు జత చేశారు