– డీసీసీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి
– కాంగ్రెస్ మండలాధ్యక్షుడు
– ఆంజనేయులు ముదిరాజ్
నవతెలంగాణ- కుల్కచర్ల
కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని డీసీసీ ఉపా ధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి, కాంగ్రెస్ మండలా ధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండలం లాల్ సింగ్ తండా గ్రామ పంచాయతీ లో కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. గ్రామ కమి టీ అధ్యక్షునిగా గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా తులసి రామ్,ఉపాధ్యక్షుడిగా రాములు నాయక్,సభ్యులుగా రవి, గోపాల్, శంకర్, కిషన్, రామచందర్,యూత్ అధ్యక్షు డిగా విస్లాబాద్ సురేష్, మహిళా అధ్యక్షురాలుగా మాజీ సర్పంచ్ రమణమ్మ ప్రధాన కార్యదర్శిగా గోవిందమ్మ, ఉపాధ్యక్షులుగా మానెమ్మ సభ్యులుగా శివమ్మ, సుమిత్రమ్మ సలహాదారులుగా నీల్యా నాయక్, శత్రు నాయక్,లక్ష్మణ్ నా యక్, మన్య నాయక్, లోక్యా నాయక్ తదితరులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య,కుల్కచర్ల ఎంపీటీసీ ఆనందం, పార్టీ సీనియర్ నాయకులు బోయిని కష్ణయ్య , కాకి నందు తదితరులు పాల్గొన్నారు.