– కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాక : వీహెచ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ బీసీ బహిరంగ సభను అక్టోబర్ 10న షాద్‌నగర్‌లో నిర్వహించనున్నామని, ఈ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సబ్ ప్లాన్, కులగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు తదితర రాజకీయ ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. బీసీలకు ఎక్కువగా సీట్లు ఇవ్వాలనీ, బీసీలు అండగా ఉంటేనే విజయం సాధిస్తామని ఆయన సూచించారు. బీసీలకు సంఖ్యాపరంగా నిధుల కేటాయింపు జరగాల్సి ఉందన్నారు.
అసద్ కేరళలో పోటీ చేస్తారా?
రాహుల్ గాంధీని హైదరాబాద్‌లో పోటీ చేయాలని ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఓవైసీ డ్రామాలాడుతున్నారని వీహెచ్ విమర్శించారు. అసదుద్దీన్ కేరళలో పోటీ చేయాలని సవాల్ చేశారు.