నవ తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ కార్యకర్తలు గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి సాయి కిరణ్, ఉప్పరి నాగయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.