నవతెలంగాణ పెద్దవంగర: దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, దివంగత రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల కోసం సేవలందించిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని దేశ ప్రజల గుండెల్లో నిత్యం సంజీవుడేనని పేర్కొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఉపాధ్యక్షుడు రంగు మురళి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, ఓరుగంటి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈదురు సైదులు, సీనియర్ నాయకులు తోటకూర శ్రీనివాస్, కుందూరు మదన్మోహన్ రెడ్డి, దుంపల శ్యామ్, రెడ్డికుంట తండా సర్పంచ్ జగ్గా బానోత్ నాయక్, కనుకుంట్ల నరేష్, పన్నీరు వేణు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, పట్టణ యూత్ అధ్యక్షుడు అనపురం వినోద్, యూత్ ఉపాధ్యక్షుడు పబ్బతి సంతోష్, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, రంగు అశోక్, రామ్ చరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.