
నవతెలంగాణ- భూధాన్ : పోచంపల్లి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల నాటినుండి పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి ఫలితమే నేడు భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభంఅనిల్ కుమార్ రెడ్డి విజయానికి నాంది భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుండి అభ్యర్థులుపోటీ చేస్తున్నప్పటికీ గెలవకపోవడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుంభ అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజల కు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలసమస్యలపై ఉద్యమాలు చేపట్టి వారి సమస్యలను పరిష్కారమయ్యే వరకు పోరాడిన వారు.. ఏ ఆపతి ఉన్న నేనున్నాను. ప్రతి ఒక్కరిని ఆప్యాయతకు చిరునవ్వుతో పలకరిస్తూ ప్రజల మనసును గెలుచుకున్న అనిల్ కుమార్ రెడ్డి రానున్న ఐదేళ్ల కాలంలో బోనగిరి నియోజకవర్గాన్ని ఎంత మేరకు అభివృద్ధిలోకి తీసుకువెళ్తారు. వేచి చూడవలసిన పరిస్థితి కేసీఆర్ అహంకార ధోరణి కాంగ్రెస్ పార్టీ విజయం కేసీఆర్ అహంకార ధోరణి నిరంకుశ పాలనకు కుటుంబ పాలన కుప్రజలు చమర గీతం పాడిన పరిస్థితి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యతిరేకత నిరుద్యోగ సమస్య నిరుద్యోగ భృతి ఉద్యోగుల సమస్యలు గతి ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తుందో వేచి చూడవలసినదే 40 ఏళ్ల చరిత్ర తిరగరాసినందుకు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి గెలుపు తో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామాలలో మున్సిపల్ పురపాలక కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ నెరవేరడంతో కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాలసంచాలు కాలుస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాలతో ర్యాలీగా పూర్వ వీధుల గుండా జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేశం యాదవ్ సామ మధుసూదన్ రెడ్డి రాఘవరెడ్డి భారత లవకుమార్ వాసుదేవ్ సూరపల్లి రాము రమేష్ గునిగంటి రమేష్ దాసర్ల జంగయ్య మక్తల గోవర్ధన్ కర్నాటిబాలరాజు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.