నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన యువకులు వివిధ కుల సంఘాల సభ్యులు మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఇప్పుడు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కేసీఆర్ మద్దతుగా, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి లో బాగా సామ్యం కావడానికి, కెసిఆర్ తో కలిసి పని చేస్తామని బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ రాజేందర్, యూత్ అధ్యక్షులు సురేష్, యువకులు, కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు.