రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పామైన భీంభరత్‌
నవతెలంగాణ-షాబాద్‌
డిసెంబర్‌ నెలలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పామైన భీంభరత్‌ అన్నారు. శనివారం చేవెళ్లలో నిర్వహించే విజయభేరి బస్సుయాత్రకు షాబాద్‌ నుంచి టీపీసీసీ కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌లతో కలిసి భారీ ర్యాలీతో చేవెళ్లకు బైలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరు నమ్మినా నమ్మికపోయిన ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని అన్నారు. డిసెంబరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడుతుందనీ, అర్హులందరికి సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం అందిస్తామన్నారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ప్రతి మహిళకు రూ.2500 నగదు, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని తెలిపారు. గడిచిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్‌తో సహా అందరు తెలంగాణను దొచుకున్నారని విమర్శించారు. నిరుపేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ పాటుపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భార్గవరామ్‌, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, అశోక్‌, మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు చంద్రయ్య, నాయకులు రవీందర్‌, పెంటారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కిషోర్‌నాయక్‌, అక్తర్‌పాష, గౌరీశ్వర్‌, సుభాష్‌రెడ్డి, రవి, బుచ్చయ్య, చెన్నయ్య, చిన్నయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.