– తెలంగాణకు కేసీఆరే భవిష్యత్: ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
కేసీఆర్ ముందు కాంగ్రేస్ గ్యారెంటీలు చెల్లవు..నిలబడవు..కాంగ్రెస్ వస్తే కుర్చిల కొట్లాటలే తప్పా ప్రజల బాధలు పట్టవని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం నర్సం పేట మండలంలోని నర్సింగాపురం, ఇటికాలపెల్లి, ఆకులతండా, ఇప్పల్ తండా, జంగాలపెల్లి తండా, గార్లగడ్డ తండా, రాజుపేట, ముత్తోజిపేట, మహేశ్వరం, లక్నెపెల్లి, రామవరం, మర్రినర్సయ్యపల్లె గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. పెద్దికి ఊరూరా బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల కూడలిలో పెద్ది మాట్లాడుతూ గడిచిన ఐదేండ్లలో నియోజకవర్గాన్ని సాగు నీటి, విద్య, వైద్య రంగాల్లో ముందుకు తీసుకొళ్లానన్నారు. ఒక నాడు నీటి గోసం ఎట్లా ఉండేదో రైతులు చవిచూశారన్నారు. ఆ బాధల నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ రాష్ట్ర వచ్చాక సీఎం కేసీఆర్ వేగవంతంగా ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని చేధించారని తెలిపారు. నియోజకవర్గానికి రంగయ్య చెరువు, పాకాలలోకి గోదావరి నీళ్లను తీసుకొచ్చి రెండు పంటలు సాగయ్యేలా తాను కృషి చేశానన్నారు. సాగు నీటి బాధలు తప్పివని రైతులు నిబ్బరంగా పంటలు పండించే స్థాయికి తీసుకరావడం వెనుక నిరంతర శ్రమ దాగిఉందని తెలిపారు. గత పాలకులు ఎస్సారెస్పీ కాల్వలు అస్థవ్యస్థంగా తవ్వి వొదిలేశారని డీబీఎం 38 కింద 11ఆర్ ఉప కాల్వను డిజైన్‌కు విరుద్ధంగా తవ్వడం వల్ల నేటికీ నీళ్లు రాకుండా పోయిందన్నారు. రూ.12 కోట్ల నిధులను మంజూరు తీసుకొచ్చామని త్వరలో కాల్వ మరమ్మత్తు పనులను చేపట్టి ఆయకట్టుకు, చెరువుల్లోకి నీటిని నింపుతామన్నారు. గురుకులాలను తీసుకొచ్చి పేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు మెరుగైన చదువులను అందుబాట్లోకి తీసుకొచ్చామన్నారు. మరో వైపు జిల్లా ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా నిర్మాణం సాగు అవుతుందని, త్వరలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఎడ్యూకేషన్ హబ్, హెల్త్ హబ్‌గా నర్సంపేటను తీర్చిదిద్దు తున్నామన్నారు. ఇక ఉన్నత చదువుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని నర్సంపేటలోనే విద్యా, వైద్యం ఉచితంగా ప్రభుత్వమే అందించనుందన్నారు. కాంగ్రేస్ అభ్యర్థిగా పోటి చేసే వ్యక్తి తిరిగి వస్తున్నాడని తన పదవీ కాలంలో ఈ నియోజకవర్గానికి ఎంచేశాడో ఒక్క పని అయిన ఉంటే చెప్పాలని అడుగాలన్నారు. తాను మాధన్నపేట చెరువును మినీ ట్యాంకు బండ్‌గా రూ.7 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే కాంట్రాక్టు దక్కించుకొని పనులు చేయకంఉడా పక్కకు పడేసి కుట్రలు పన్ని నిలిపివేశాడన్నారు. తానకు ఒక్క సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తేనే అభివృద్ధి అంటే ఎంటో మీకు కళ్లారా చూపించానని మరో సారి గెలిపించి దీవిస్తే మీ బిడ్డగా మిగిలిపోయిన పనులన్నీంటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాన్నారు. ఈ తనను ఎదుర్కొనే సత్తా లేక సారి కూడా ఆఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకటైయ్యారని.. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కంటే వారికి కాంట్రాక్టుల మీద మక్కువ ఎక్కువని ఎద్దేవజేశారు. అధికారం కోసం వారు ఎంతటికైనా దిగజారుతారని విమర్శించారు.ఎన్నో యేండ్లగా గిరిజనేతరులు పోడు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఇటివల సర్వే చేయించి హద్దులు కేటాయించామని గుర్తు చేశారు. మరో సారి కేసీఆర్‌ను సీఎంగా చేస్తే హక్కు పత్రాలు కూడా వస్తాయని తెలిపారు. పట్టాలు ఇవ్వడమే కాదు కరెంట్, సాగు నీళ్ల సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఇటుకాలపెల్లి, రాజుపేట తదితర తండాల పరిధిలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలను తీసుకొస్తామని తెలిపారు. అభివృద్ది పనులే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించామన్నారు. కారు గుర్తుకు ఓటేసి మరో సారి గెలిపిస్తే వచ్చే నెల నుంచే సన్న బియ్యం పంపిణీ చేస్తామని, పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ రెట్టింపు చేస్తామన్నారు. రైతు బంధు పథకం రూ.16 వేలకు పెంచుతామన్నారు. ఆడబిడ్డకు రూ.3 వేలను ప్రతి నెల ఖాతాలలో జమ చేస్తామన్నారు. ఇవన్ని అమలు కావాలంటే ఈ రాష్ట్రంలో కారు గుర్తుకు ఓటేయాలని, సీఎంగా కేసీఆర్‌ను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆరే ఈ రాష్ట్రానికి గ్యారెంటీ అని కాంగ్రేస్ వాళ్ల గ్యారెంటీల తాయిలాలు నిలబడవన్నారు. నిత్యం అందుబాట్లో ఉండి సేవలందించే తనను మరో సారి గెలిపిస్తే మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసి నియోజకవర్గాన్ని ఆద్భుతంగా తీర్చిదిద్ది మీ ముందుకు ఉంచుతానిని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మండలా ధ్యక్షులు నామాల సత్యనారాయణ, ఎంపీపీ మోతె కలమ్మ, నాయకులు మచ్చిక నర్సయ్య, ఈర్ల నర్సింగ రావు, కడారి కుమారస్వామి, సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్య వీరన్న, భానోతు ధస్త్రు, కోఆర్డినేటర్ గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు.