ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ చేసిందేమి లేదు

– ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా ఎస్సీ, ఎస్టీల కోసం చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్‌ ఏనాడు పట్టించుకోలేదని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ ఆ వర్గాల కోసం దళిత బంధు తెచ్చిందనీ, పోడు సమస్యను పరిష్కరించిందని తెలిపారు. బీజేపీ నల్ల చట్టాలను తెచ్చి రైతుల చావులకు కారణమయిందని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.