అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం

నవతెలంగాణ-భిక్కనూర్ :
తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో ఆరు కాంగ్రెస్ గ్యారంటీ పథకాలపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలైన గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్, ఇండ్లు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలకే పరిమితం అయ్యాయని, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలపై మొదటి సంతకం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, అధికార పార్టీకి ఓటు వేస్తే ప్రతి ఇంట్లో లక్షల రూపాయల అప్పు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, జిల్లా ఎన్నారై సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మల్లు పల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి, జిల్లా రైతు నాయకులు లింగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.