నవతెలంగాణ – మదనాపురం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ ఆన్నారు.మదనాపురం మండల కేంద్రంలో ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలపై శుక్రవారం అవగాహనా కల్పిస్తూ మాట్లాడారు.500 లకే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు, యువతకు చేయూత తదితర వంటి పథకాల పై వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందా రన్నారు.కాంగ్రెస్ అదికారంలోకి వస్తేనే అన్ని రంగాలు అభివద్ది చెందు తాయని భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు రామకష్ణ, నాయకులు శేఖర్ రెడ్డి. కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.