రాష్ట్రములో కాంగ్రెస్ దే అధికారం

నవ తెలంగాణ-దోమకొండ

సీఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని  ప్రజల సంక్షేమo విస్మరించరని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించి, చాముండేశ్వరి దేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పాదయాత్రగా కార్యాలయం వరకు చేరుకొని జెండా ఆవిష్కరణ చేసి,. గడపగడపకు షబ్బీర్ అన్న కార్యక్రమంలో భాగంగా మండలంలోని గోపాల్ పల్లి,అంబర్పేట్ గ్రామాలలో,కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ  చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రము లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తుందని, ఖాళీ స్థలం ఉన్న వారికి 6 లక్షల రూపాయలు అందజేస్తుందాన్నరు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తుందని తెలిపారు. సీఎం కెసిఆర్ అధికారం లో నిరుపేదలు ఏస్సి, ఎస్టిల ప్రభుత్వ భూములను స్వదినo చేసుకొని, ప్రయివేట్ కంపెనీ లకు అధికా ధరలకు విక్రయించుతున్నారన్నారు. సీఎం కెసిఆర్ ప్రతి నిద్యం వహించుతున్న గజ్వేల్ నియోజకవర్గం లో అభివృద్ధి శూన్యం అని, వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెపుతున్నారని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములు అమ్మ డనికే సీఎం కెసిఆర్ కామారెడ్డి నియోజకవర్గం లో పోటీ చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి సీఎం కెసిఆర్ ను ఓడించాలని కోరారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని కెసిఆర్ ను చిత్తశుద్ధిగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులూ ఐకమత్యంగా ఉంటూ కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంద్ర కరణ్ రెడ్డి,మండల అధ్యక్షుడు చంద్రయ్య గారి అనంతరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, పట్టణ అధ్యక్షుడు సీతారాము మధు, ఆశ పోయిన శ్రీనివాస్ సంజీవరెడ్డి,నాయకులు సందీప్, పల్లె రామ స్వామి గౌడ్, రమేష్ సీతారాం ప్రసాద్ రామస్వామి గౌడ్ గోపాల్ రెడ్డి నాగారపు రాములు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.