కర్ణాటక రాష్ట్ర మంత్రి దినేష్ గుండురావుకు కాంగ్రెస్ నాయకుల  సన్మానం 

నవతెలంగాణ- మల్హర్ రావు: కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ క్యాబినేట్ మంత్రి, దినేష్ గుండురావు, తెలంగాణ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబును ఆదివారం  శ్రీడర్ బాబు స్వగ్రామం ధన్వాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని అడిగి తెలుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసేల్ అధ్యక్షుడు దండు రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు  దినేష్ గుండు రావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాటారం ఎంపిపి పంథకానీ సమ్మయ్య, మండల ఎస్సిసేల్ అధ్యక్షుడు మంథని రాజా సమ్మయ్య పాల్గొన్నారు.