ఎమ్మార్వో ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ- భిక్కనూర్
భిక్నూర్‌ మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో నూతన ఎమ్మార్వో గా పదవి బాధ్యతలు చేపట్టిన శివప్రసాద్‌ ను మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు రెవెన్యూ అధికారులకు సహకరించాలని ఎమ్మార్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల ఎంపిటిసి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి గౌడ్, నాయకులు నర్సాగౌడ్, సిద్దా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.